ప్రముఖ సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కన్నుమూసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈవీవీ పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఆయనను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసారు. అప్పటి నుంచీ ఐ.సి.యు.లో వుంచి ఆయనకు చికిత్స చేసారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ రాత్రి (జనవరి 21) 11 .30 నిమిషాలకి ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య , ఇద్దరు కుమారులు వున్నారు. తనయులు రాజేష్, నరేష్ లిద్దరూ సినిమా నటులే అన్న సంగతి తెలిసిందే.
హాస్య చిత్రాలకు పెట్టింది పేరైన ఈవీవీ ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడు. ఈయన తొలి చిత్రం 'చెవిలోపువ్వు'. అయితే, 'ప్రేమఖైదీ' చిత్రంతో సక్సెస్ పొంది హాస్య, వినోదాత్మక చిత్రాల నిర్మాణంలో తనదైన ముద్ర వేసారు. ప్రముఖ హీరోలందరి తోనూ చిత్రాలు రూపొందించారు.
E.V.V. satyanarayana died
Saturday, January 22, 2011
Labels:
EVV,
EVV SATYANARAYANA
Posted by
ramesh
at
Saturday, January 22, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment