Sadhi's Blog Time

Gopichand as bellamkond'as Bodyguard

Saturday, January 22, 2011



మలయాళంలో సిద్దికీ దర్శకత్వంలో వచ్చిన 'బాడీగార్డ్' చిత్రం తమిళంలో 'కావలన్' పేరుతో రూపొంది, అక్కడ కూడా హిట్ అయింది. విజయ్, అశిన్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ నాట మంచి పేరు తెచ్చుకుంది. దీనిని హిందీలో తాజాగా సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడీ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల్ని బెల్లంకొండ సురేష్ ఫ్యాన్సీ రేటిచ్చి కొన్నాడు. గోపీచంద్ తో తెలుగులో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపుతున్నాడు. మొదట్లో వెంకటేష్ ఇంటరెస్ట్ చూపించాడు. అయితే, ఇటీవల వెంకీ నటించిన మరో రీమేక్ సినిమా 'నాగవల్లి' అట్టర్ ఫ్లాప్ కావడంతో, 'ఇక రీమేక్ లు వద్దు' అంటూ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ చిత్రాన్ని కూడా బెల్లంకొండ సురేశే నిర్మించాడు. అది ఫ్లాపయినా కూడా సురేష్ కి రీమేక్ ల పట్ల నమ్మకం మాత్రం పోవడం లేదు. మరి ఇదైనా హిట్ అవుతుందో? లేక మరో వీర ఫ్లాపవుతుందో

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner