Sadhi's Blog Time
Showing posts with label surya in raktha charitra. Show all posts
Showing posts with label surya in raktha charitra. Show all posts

Reason behind acting in raktha charitra- surya

Wednesday, April 14, 2010



రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరిగా ప్రముఖ తమిళ నటుడు సూర్య చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో హీరోగా చేస్తున్న తాను ఓ పాత్రలా ఒదిగిపోయి చేయటానికి కారణం మీడియాకు సూర్య వివరించారు. నేను తమిళ ఇండస్ట్రీలో గత 12 సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాను. నా అదృష్టం కొద్దీ గొప్ప దర్శకులతో, స్క్రిప్టులతో నేను పనిచేసాను. ఇప్పటికీ నాకు తమిళంలో అధ్బుతమైన ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇతర భాషల్లో మంచి స్క్రిప్టు,దర్శకుడు దొరికినప్పుడు ఎందుకు వదలాలి అన్న భావనే రక్త చరిత్రలో పాత్ర ఒప్పుకునేలా చేసింది.

ఓ హీరోలా కాకుండా ఓ నటుడుగా నా ఎల్లలు నేను చెరిపేయదలచుకున్నాను. ఇక దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మకి సినిమాలమీద ఉన్న ప్రేమ నాకు బాగా నచ్చుతుంది. అలాగే ఆయన ఎప్పుడూ క్యారెక్టర్స్ ని ఒకదానకికొకటి సంభందం లేకుండా క్రియేట్ చేస్తూ తన ఐడియాలను బాగా ప్రెజెంట్ చేస్తూంటారు.

ఇక నేను నా కంపర్ఠ్ జోన్ వదిలిరాకపోతే, నేను వర్మ అద్బుతమైన మేకింగ్ స్టైల్ ని ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయలేను. ఆయన ఎలాగూ తమిళ సినిమా చేయటానికి చెన్నై రారు. అది ష్యూర్. అందేకే నేనే ముంబై వచ్చి ఈ రక్త చరిత్ర వెంచర్ లో పాలుపంచుకుంటున్నాను. ఇదంతా చూసి నేనేదో హిందీలో వెలిగిపోదామని వచ్చాననుకోవద్దు. హిందీలో ట్రైచేసే మరో తమిళ హీరో కావటం నాకు ఇష్టం లేదు. అలాంటి అటెన్షన్ క్రియేట్ అవటం సుతరామూ ఇష్టం లేదు అంటూ సూర్య తన మనస్సులో మాటను మీడియాతో చెప్పారు. ఆయన రక్త చరిత్రలో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పాత్రను చేస్తున్నారు. ఆయన సరసన ప్రియమణి చేస్తోంది.

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner