రంగారెడ్డి జిల్లాకి చెందిన ఇద్దరు బీసీ నాయకులు కొంపముంచడంతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మింగలేక కక్కలేక బాధపడుతున్నారు. నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి తెలంగాణలో అర డజను టికెట్లు గౌడ్ తీసుకుని అమ్ముకున్నారన్న విషయం ఆలస్యంగా చిరంజీవి దృష్టికి వచ్చింది. మల్కాజిగిరి లోక్ సభ స్ధానానికి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్ధానానికి దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటే చేశారు. ఆయన సరిగ్గా ప్రచారం చేయకపోవడం, డబ్బు ఖర్చుపెట్టకపోవడం వల్ల రెండు స్ధానాల్లో ఓడిపోతారని ఆ జిల్లా పరిశీలకులు చిరంజీవి దృష్టికి తెచ్చారు. దేవేందర్ గౌడ్ తాను గెలవడమే కాక రంగారెడ్డి జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తారని ఆశించిన చిరంజీవి ఇప్పుడు డీలా పడిపోవలసి వచ్చింది.గౌడ్ ను పిచ్చి పిచ్చిగా నమ్మేసిన పవన్ కల్యాణ్ అయితే ఇప్పుడు పుణెలో విశ్రాంతి తీసుకుంటూ తనను తాను తిట్టుకుంటున్నాడట. ప్రజారాజ్యాన్ని మోసం చేసిన మరో నాయకుడు కాసాని జానేశ్వర్ ముదిరాజ్. ఆయన తన మన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేయకుండా "పొత్తు" కుదుర్చుకుని కొన్ని సీట్లు కొట్టేశారు. మన పార్టీ అభ్యర్ధులెవరూ గెలిచే అవకాశం లేదన్న విషయం చిరు దృష్టికి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న చిరంజీవి ఎన్ని కఠినమైన ఒత్తులు దిద్దుకోవలసి ఉందో మరి. మహాకూటమి అధికారంలోకి వచ్చాక దేవేందర్ గౌడ్ టిడిపిలోకో, టీఅర్ ఎస్ లోకో ఫిరాయిస్తారని విన్పిస్తోంది
chiru ni munchina devendar goud
Saturday, May 9, 2009
Labels:
POLITICS COMMEDY
Posted by
ramesh
at
Saturday, May 09, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment