ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం రాష్ట్ర సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణతో కొద్ది సేపు భేటీ అయ్యారు. ఏజన్సీ ప్రాంతాల్లో పర్యటించేందుకు విశాఖపట్నం వెళ్లిన చిరును అక్కడి విమానాశ్రయంతో బొత్సాకలిశారు. వీరిద్దరు కొద్ది సేపు సమావేశం అయ్యారు. అనంతరం చిరు మీడియాతో మాట్లాడుతూ బొత్సాతో మంచి స్నేహం ఉందని అంతే తప్ప ఈ భేటికి ఎలాంటి ప్రత్యేకత లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో చిరు-బొత్సా భేటీ రాజకీయ ప్రత్యేకత ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈరోజు ఉదయం ఎనిమిదిన్నరకు మంత్రి బొత్స వైజాగ్ విమానాశ్రయంలో హైదరాబాద్ విమానం ఎక్కవలసి ఉందని అయితే ఆలస్యం కావడంతో ఫ్లైట్ వెళిపోయిందని, విఐపి లాంజ్ లో మరో విమానం కోసం ఎదురుచూస్తుండగా చిరంజీవి వచ్చారని ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. బొత్స తనకు పాత మిత్రుడని, కాకతాళీయంగా తాను ఈరోజు కలుకుని మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రసక్తి రాలేదని చిరంజీవి మీడీయాకు చెప్పారు. బొత్స మాత్రం మీడియాను తప్పించుకుని వెళ్ళిపోవడం గమనించవలసిన విషయం.
chiru pai mantri bothsa gurru gurru
Saturday, May 9, 2009
Labels:
POLITICS COMMEDY
Posted by
ramesh
at
Saturday, May 09, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment