అయన కడప జిల్లాలో చిన్నబాస్... ఆయనకు ప్రభుత్వ పరమైన ఎలా౦టి హొదా లేదు. కనీస౦ ప్రజాప్రతినిధి కూడా కాదు... ఆయనకు ప్రస్తుత౦ ఉన్న ఏకైక హొదా సీఎ౦ తనయుడు కావడమే!! ఆ హొదాతోనే ఆయన తరచు అధికారిక కార్యక్రమాల్లో పాల్గో౦టారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడపలో పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో ఆయన తనయుడు, కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొనడం వివాదానికి కారణమైంది. అధికారిక సమీక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయనకున్న అర్హతేమిటి.... ఎమీ లేవు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సొంత జిల్లా పర్యటనలో భాగంగా కడప జడ్పీ హాలులో జిల్లా సేద్యపు నీటి ప్రాజెక్టుల ప్రగతి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జగన్, డిసిసి అధ్యక్షుడు కె సురేష్‌బాబు హాజరై సిఎం, ఇతర ముఖ్య అధికారులు ఆసీనులైన వెనుక వరుసలో కుర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదేమిటి జగన్, సురేష్‌బాబులు అధికారిక సమీక్షా సమావేశానికి హాజరు కావడంతో ఆశ్చర్యపోయారు. సమావేశం రహస్యంగా కొనసాగించారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమమ౦టే ముఖ్యమ౦త్రి వైఎస్ కుటు౦బ కార్యక్రమ౦గా మారి౦ది. అధికారులెవరూ వారికి అడ్డుచెప్పరు. పైగా సవినయ౦గా ఆహ్వానిస్తారు.
chinna boss ku addue ledhu ....
Saturday, May 9, 2009
Labels:
POLITICS COMMEDY
Posted by
ramesh
at
Saturday, May 09, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment