

బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్వని ని నాగార్జున కుమారుడు నాగచైతన్యకిచ్చి చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున, బాలకృష్ణ వియ్యంకులుగా మారితే సినీ పరిశ్రమలో ఇక తిరుగుఉండదని, రామానాయుడు ఫ్యామిలీ కూడా అప్పుడు బాలయ్యను సపోర్టు చేస్తుందని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ రకమైన చంద్రబాబు చేసి, బాలయ్యకు సూచించారని చెప్తున్నారు.ఈ నేపధ్యంలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే నాగచైతన్య మంచి క్రేజ్ తెచ్చుకున్నాడని, బాలయ్య అతన్ని పర్శనల్ గా అభినందించాడని వినపడుతోంది. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూసకొస్తున్న అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబాలకు చెక్ చెప్పాలన్నా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ పెళ్ళి ఇప్పుడిప్పుడే ఉండదని, ఓ మాట అనుకుని తర్వాత ముందుకెళ్తారని అంటున్నారు. అయితే నాగార్జున ఈ విషయమై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారనేది మాత్రం తెలియదు
0 comments:
Post a Comment