
దర్శకరత్నగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు సోమవారం 63వ సంవత్సరంలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మదిలోని భావాలను మనతో పంచుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు తన భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా ఆయన మనసు విప్పారు.దాసరి పంచుకున్న భావాలు మీకోసం..నటుడిగా చాలా తక్కువ చిత్రాలు చేశాను కాబట్టే నటుడిగా గౌరవాన్ని కాపాడుకుంటున్నా.కథాపరంగా నాది ప్రధాన పాత్ర అయితే బయటి చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా ఇకముందు కూడా నటిస్తాను. తాజాగా నేను ప్రధాన పాత్రలో వచ్చిన మేస్త్రీ చిత్రంలో చెప్పిన ఓటుహక్కు సందేశం జనాల్లో చేరిందనే భావిస్తున్నాను. పోలింగ్ శాతం పెరగడంలో కొంత నా పాత్ర కూడా ఉంది.ఓటుహక్కుతో ముసుగు వేసుకున్న మోసగాళ్ళను నమ్మవద్దనే సందేశం జనాల్లో చేరింది.మేస్త్రీలో చెప్పిన ఓటుహక్కు సందేశం ఫలితం ఈ నెల 16న తేలుతుంది.మేస్త్రీ చిత్రం చూసి కొందరు భుజాలు తడుముకుంటున్నారంటే ఆ పాత్రలకు వారికి సంబంధం ఉండివుండవచ్చు.ఎంతోమంది ఉన్నా వారేమీ మాట్లాడుకుండా కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారో ఆలోచిస్తే ఇట్టే తెలిసిపోతుంది.జగపతిబాబు నటించిన బంగారుబాబు సినిమా మే ఒకటిన విడుదలైంది.ఓపెనింగ్ చాలా డల్‌గా ఉన్నా,నిదానంగా మొదటి ఆటకు పుంజుకుంది. హిట్ టాక్ కూడా వచ్చింది. జగపతిబాబు నటన ఈ సినిమాలో అదిరింది.మహిళా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ప్రేమాభిషేకం తర్వాత ఈ చిత్రంలోని సంగీతాన్ని ప్రేక్షకులు అంతగా ఆస్వాదిస్తున్నారు.నా 149వ సినిమాకు త్వరలోనే దర్శకత్వం వహించబోతున్నా.సంచలనాత్మకమైన కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అందరి అంచనాలకు దగ్గరగా ఉంటుంది. అదే విధంగా ఈ ఏడాది స్వంత నిధితో నీడ అనే సేవా సంస్థను ప్రారంభిస్తున్నా. వృద్ధాశ్రమం, చైల్ట్‌లేబర్లకు విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్ళమీద నిలబడేలా చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. నా ఆదాయంతో శాశ్వతంగా ఈ సంస్థగా నెలకొల్పుతాను.కళాకారులను గౌరవించడానికి,సత్కరించడానికి కారణం... బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ మనిషి, కాళ్ళకు చెప్పులు లేకుండా మద్రాసులో అడుగుపెట్టి ఒక వ్యవస్థ కాగలితే ఆ వ్యవస్థకు కారణభూతులైన నిర్మాతలు,తోటి సాంకేతిక నిపుణులు,సినిమా మూల స్థంభాలైన 24క్రాఫ్ట్‌లలోని వారిని సత్కరించడం అవసరంగా భావించి ఈ పని చేస్తున్నాను. రాజకీయ చిత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు తీయలేం. మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు తప్పకుండా తీస్తా.సొంత బేనర్‌పై ఇతర దర్శకులకు అవకాశం కల్పించేందుకు నెనెప్పుడూ సిద్దమే. రెండు, మూడు కొథలతో కొత్తవారు వచ్చారు. నచ్చితే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం రేలంగి నరసింహారావు ఓ రచయితతో కథ తయారు చేశారు.
0 comments:
Post a Comment