హైదరాబాద్: కీలకమైన ప్రజారాజ్యం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఆ పార్టీ వ్యూహకర్త డాక్టర్ మిత్రా హాజరు కాలేదు. కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల సరళిపై సమీక్ష, ఫలితాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరిగాయి. పార్టీ ముఖ్యనేతలంతా హాజరైన ఈ సమావేశాలకు డాక్టర్ మిత్రా హాజరుకాలేదు. దీంతో ఆయన నిష్క్రమణ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఎన్నికల్లో మిత్రా నెల్లూరు జిల్లా నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా ఆయనకు ఇవ్వలేదని, అందువల్ల అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని గుసగుసలు విన్పించాయి.అయితే తానే పార్టీ వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉన్నందున టికెట్ తీసుకోలేదని మిత్రా వివరణ ఇచ్చుకున్నారు. అయితే మిత్రా ప్రజారాజ్యానికి రాజీనామా చేయబోరని, ఆయన క్రమంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటారని, కొద్ది రోజుల్లో ఫారిన్ టూర్ కు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది
party ni vidipoe mundhu.......ee thokkalo meetinglu endhuku annayie manaku ani anukunnademo..leka party nundi bayataku poyaka andarila ethanu kuda thana party matters [emi levanukondi -samajika nyayam ane oka gola tappa] leak chesthadanukoni pilavaledemo mana chiru.........emi jarugutundho prp lo........evariki telusu okka allu ki tappa.....
0 comments:
Post a Comment