ఎన్టీఆర్ రూట్లో వెళ్ళటానికి కమిడియన్ సునీల్ ప్రయాణం పెట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'యమదొంగ'లో ఎన్టీఆర్ సన్నబడి అందంగా కనిపించారు. అలాగే సునీల్ ని అవమని రాజమౌళి పురమాయించటంతో దాదాపు పదిహేను కేజీలు తగ్గి ఇలా తగ్గి చూపించారని తెలుస్తోంది. ఆయన సూచనల మేరకు ఈ సినిమా కోసమే సునీల్ ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేసి తనను తాను మార్చుకున్నారు. పూర్తి స్దాయి కామిడీతో నడిచే హీరో పాత్రను అందాల రాముడు తర్వాత పోషించటంపై చాలా సంతోషంగా ఉన్నారు సునీల్.అంటే ఈ సినిమా వర్కవుట్ అయితే సునీల్ సిక్స్ పాక్స్ కి ట్రై చేస్తాడేమో అని కొందరు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం హీరో అవ్వాలంటే ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే అని ప్రోత్సహించాడని చెప్తున్నారు. ఇక త్రివిక్రమ్ ఈ చిత్రానికి ఓ వెర్షన్ రాసి ఇచ్చారని కూడా తెలుస్తోంది. అంటే ఓ రకంగా త్రివిక్రమ్ స్క్రిప్టుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు..అది గ్యారింటీ గా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. అయితే రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా కూడా వినపడ్తోంది. వీటిల్లో ఏది ముందు ప్రారంభమవుతుందో చూడాలి.
ANNAYIE EVARU CHESE PANI AADU CHEYALI........ TAPPULEDHULE EVADEVADO INDUSTRYLO OPERATIONS THO FACE LANI CHANGE CHESUKONI JANALU DADUCHUKUNTUNNA SCREENS MIDHA RATLEDHU VALLA KANTE NUVVU CHAALA BETTERLE ANNAYIEEE........NUVVU PROCEED AYIPOOOO
0 comments:
Post a Comment