Sadhi's Blog Time

NAGA CHAITANYA WITH VENKY ?

Wednesday, April 29, 2009





నాగచైతన్య, వెంకటేష్ సొంత మామయ్య, మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రక్త సంభంధం తెరమీదా చూపటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమచారం. నాగచైతన్య తరువాత సినిమాలో ఈ ప్రయోగం జరగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వం, రచనలో వచ్చే ఈ సినిమా పాపులర్ జోయి అండ్ హిజ్ నెఫ్యూ ఆఫ్ స్పిన్ ఆఫ్ సీరిస్ ఆధారంగా తయారవనున్నదని సమాచారం. అలాగే ఈ చిత్రం పూర్తి ఫన్ తో ఉంటుందని, నువ్వు నాకు నచ్చావు తరహా కామిడీ సన్నివేశాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నట్లు చెప్తున్నారు.

ఇక వెంకటేష్ ఈ స్టోరీలైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డిసెంబర్ రెండవ వారంలో లాంఛనంగా చిత్రం ప్రారంభం మయ్యే అవకాశముంది. మల్లీశ్వరి తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఏ చిత్రమూ రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్...మహేష్ హీరోగా వరుడు(టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు) చిత్రంలో చేస్తున్నారు. మహేష్ సరసన అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం తయారుకానుంది. అలాగే నాగచైతన్య..వాసు వర్మ అనే నూతన దర్శకుడు హీరోగా తయారవుతున్న జోష్ చిత్రంలో చేస్తున్నారు. ఇందులో రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే వెంకటేష్..కమల్ తో కలిసి ఎ వెడ్నస్ డే రీమేక్ ఈనాడు చిత్రంలో చేస్తున్నారు.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner