Sadhi's Blog Time

స్వైన్ ఫ్లూకు 159 మంది బలి........

Wednesday, April 29, 2009







మెక్సికో: స్వైన్ ఫ్లూకు మెక్సికోలో ఇప్పటి వరకు 159 మంది మరణించినట్లు హెల్త్ సెక్రటరీ జోస్ కోర్డోవా చెప్పారు. దాదాపు 2 లక్షల 498 మంది వ్యాధితో బాధపడుతున్నారు. మెక్సికో నుంచి ఇతర దేశాలు విమాన రాకపోకలను రద్దు చేసుకున్నాయి. అయితే మెక్సికోలో ప్రారంభమైన ఈ వ్యాధి న్యూజిలాంగ్, ఇజ్రాయిల్, అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్ దేశాలకు కూడా పాకుతోంది.అమెరికా తన సరిహద్దుల వెంట నిఘాను పటిష్టం చేసింది.

మెక్సికోకు వెళ్లకూడదని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. కెనడా, ఫ్రాన్స్ లు కూడా అదే విధమైన ఆదేశాలు జారీ చేశాయి.క్యూబా మొదట మెక్సికోకు ప్రయాణాలను రద్దు చేసింది.అమెరికాలో సైన్ ప్లూ వ్యాధి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఏడాది ఇటువంటిది మామూలేనని అమెరికా అంటోంది.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner