Sadhi's Blog Time

HAASYA BRAHMA.........THERA VENUKA VILLANA ...?

Thursday, April 30, 2009



తెరపై అందరినీ నవ్వించే బ్రహ్మానందం తెరవెనుక నిర్మాతలను ఓ రేంజిలో ఏడ్పిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఎప్పటినుంచో వినపడుతున్నదే. అయితే అతనికున్న మార్కెట్ దృష్ట్యా అతన్ని భరించక తప్పటలేదని, వెనుక తిట్టుకుంటూనే భరిస్తూంటారు. తాజాగా అతనిచ్చే ట్విస్టుల్లో అతని రెమ్యునేషన్ పెంపకం కూడా చేరింది. తాజాగా ఓ కొత్త నిర్మాత బ్రహ్మానందంను తమ సినిమాలో చేయమని సంప్రదించారు.

దానికి బ్రహ్మీ రోజుకి మూడున్నర లక్షలు కావాలని డిమాండు చేసాడు. అంత ఇచ్చుకోలేమంటే పోనీ గంటకు 50 వేలిమ్మన్నాడట. చివరికి రోజుకి రెండు లక్షలకు బేరం కుదిరిందట. అయితే దర్శకుడు ఆబ్లిగేషన్ మేరకు ఆ నిర్మాత తలవొంచుకుని ఎగ్రిమెంట్ రాసుకున్నారు. అప్పటినుంచి నరకమంటే ఏమిటో తెలిసిందంటున్నారు ఆ నిర్మాత తన సన్నిహితులతో...

షూటింగ్‌కి రావటమే లేటుగా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చి, సాయంత్రం నాలుగింటికి ఇంటికెళ్ళిపోయాడట. డైరక్టర్ చెప్పింది చెప్పినట్లు చేయకుండా ఇంప్రవైజేషన్ పేరట దాన్ని ఖూని చేస్తున్నాడు. ఈ విధంగా ఆ నూతన నిర్మాతకి ప్రత్యక్షంగా నరకం అంటే ఏమిటో చూపిస్తున్నాడట. ఇదే ఏ రామానాయుడిగారి సినిమానో, ఏ అల్లు అరవింద్ సినిమానో, ఏ అశ్వనీ దత్ సినిమానో అయితే బ్రహ్మానందం ఇలా చేస్తాడా...కొత్తవాణ్ణనేగా నన్ను ఇలా ఏడ్పిస్తున్నాడని ఆ నిర్మాత గోలెత్తిపోతున్నాడు. అయితే ఇది ఒక నిర్మాత బాద కాదు..చాలా మంది మింగలేక కక్కలేక ఉంటున్నారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలతో మరింత డిమాండు పెంచుకున్న ఈ హాస్యనటుడు సాయింత్రం ఐదుంపావు దాటితే పనిచేయనంటాడు. అలాగే రోజుకింత అని కాల్షీటు ఇచ్చి సంపాదించుకునే ఈయన ప్రతీరోజు షూటింగ్ నుంచి ఇంటికి క్యారేజీ పంపుతూంటాడు. అంతేగాక షూటింగ్ లు సిటీ లిమిట్స్ లోనే పెట్టుకోమంటాడు. బయిటకు వెళ్ళటానికి ఇష్టపడడు.

ఇక షూటింగ్ సమయంలో కొత్త దర్శకుడు, డైరక్టర్ అయితే ఆయన చెప్పినట్లు విని, ఈయన చెప్పే డైలాగులు షూట్ చేయాల్సిందే. అలాగే షూటింగ్ టైమ్ లో పేకాట పెట్టుకుంటాడు. ఎవరూ డిస్ట్రబ్ చెయ్యకూడదని ముందే ఆదేశాలు ఇస్తాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఆయన వేసే కౌంటర్స్, డైలాగ్స్ కి యూనిట్ సభ్యులు నోరుమూసుకు ఉండాల్సిందే. ఇవన్నీ భరిస్తేనే తెరపై ఆయన మంచి మూడ్ లో నవ్విస్తాడు. లేదా మూడ్ లేదని చెక్కేస్తాడు.

ఇంత టార్చర్ పెడుతున్నా ఆయనకి పోస్టర్ వ్యాల్యూ డిస్ట్రిబ్యూటర్స్ కోసమైనా భరించారు. ఆయన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసిన ఇ.వి.వి వంటి వారు సైతం ఇప్పుడు అవకాశమివ్వటానికి వెనకడుగు వేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. డిమాండ్ అంటే మాటలా..ఇలాగే ఉంటుంది.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner