అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించుకోబోతున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇందు నిమిత్తం ఆయన నిన్న అపోలో హాస్పటల్స్ కి వెళ్ళారని చెప్తున్నారు. అయితే అదంతా రూమరేనని, అపోలోకి వేరే పనిమీద వెళితే ఇలాకథ అల్లారని కొందరు అంటున్నారు. అయితే అతని దర్శక, నిర్మాతల వైపు నుంచి ముక్కుపై కంప్లైంట్ లేకపోయినా ఫారిన్ లో ఉన్న అతని గర్ల్ ప్రెండ్ కి మాత్రం పట్టుపడుతోందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు సైతం సర్జరీ చేయించాల్సినంత అవసరం లేదని ఇఫ్పటికే చక్కటి ముక్క కలిగి ఉన్నాడని చెప్పి చూసారట. అయినా బన్ని తృప్తి చెందక డాక్టర్స్ ని సంప్రదించాడని వార్త. ఇక ఇప్పటికే కొన్ని సర్జరీలు చేయించుకున్న బన్ని ఈ విషయంపై ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రసుత్తం అర్జున్..సుకుమార్ దర్శకత్వంలో ఆర్య-2, గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే వి.వి.వినాయిక్ దర్సకత్వంలో తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
ALLU ARJUN NOSE SURGERY ..........
Thursday, April 30, 2009
Posted by
ramesh
at
Thursday, April 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment