మెక్సికోలో బయటపడిన కొత్త ఫ్లూ వ్యాధి అంతకంతకూ తీవ్రమవడంతో ప్రపంచమంతా అప్రమత్తమైంది. కొద్దిరోజుల క్రితమే 'స్వైన్‌ప్లూ' వ్యాధి మెక్కికో, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రబలింది. ఈ వ్యాధి కారణంగా మెక్సికోలో ఇప్పటివరకు వందమందికి పైగా మృత్యువాత పడ్డారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జంతువులు, పశువుల వంటి క్షీరణాల ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తోంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని, మందులకు లొంగకుండా ఉండే స్థాయికి కూడా చేరగలదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచమంతా దీన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపింది. వ్యాధి నిరోధక మందులు అన్ని చోట్లకు పంపుతున్నామని కొన్ని విమానాశ్రయాల్లో కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని సమితి తెలియజేసింది. ఈ 'స్వైన్‌ప్లూ' తొలిసారిగా థాయిలాండ్‌లో కనపించింది. ఇతర ప్లూ వ్యాధుల నివారణకు వాడే మందులు దీనిని అరికట్టలేవు. అంతర్జాతీయంగా ఈ ప్లూ పట్ల ప్రజారోగ్య వ్యవస్థ అప్రమత్తం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
'స్వైన్‌ప్లూ' - కొత్త ఫ్లూ వ్యాధి
Tuesday, April 28, 2009
Labels:
SCIENCE
Posted by
ramesh
at
Tuesday, April 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment