2011లో ఉపఖండం దేశాల్లో జరగనున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ అత్యధిక మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇవ్వనుంది. మంగళవారం ఐసీసీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రత కారణాల దృష్య పాకిస్థాన్‌లో నిర్వహించాలనుకున్న 14 మ్యాచ్‌లను కూడా భారత్, శ్రీలంకల్లోనే నిర్వహిస్తారు. భారత్‌లో 29 మ్యాచ్‌లు, శ్రీలంకలో 12, బంగ్లాదేశ్‌లో 8 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఐసీసీ చీఫ్ డేవిడ్ మోర్గాన్ తెలిపారు. సెమీఫైనల్స్ మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలో జరుగుతాయి. ఫైనల్ భారత్‌లోనే నిర్వహించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌లో నిర్వహించాలనుకున్న 14 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించండి అని పీసీబీ పెట్టిన షరతును ఐసీసీ నిరాకరించింది.
2011 ప్రపంచకప్‌లో 29 మ్యాచ్‌లు భారత్‌లోనే .....
Tuesday, April 28, 2009
Labels:
CRICKET
Posted by
ramesh
at
Tuesday, April 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment