Sadhi's Blog Time

Leader , Special Show For Rahul Gandhi

Saturday, February 6, 2010



కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కోసం 'లీడర్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని చిత్ర దర్శకుడు దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచనగా తెలుస్తోంది. నాయకుడు అనే వాడు ఎలా ఉండాలి...సమజానికి ఎలాంటి ఆదర్శవంతమైన నాయకుడు అవసరం అనే పాయింట్ తో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రెండేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా దగ్గుబాటి రానా హీరోగా తెలుగుతెరకు పరిచయంకానున్నారు.

తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదుగానే రావడం, పూర్తిగా ఇది రాజకీయ నేపథ్యంలో ఉండే సినిమా కావడంతో సహజంగానే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రానా ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగి రియల్ లీడర్ అనిపించుకున్నారనేది శేఖర్ కమ్ముల ఆసక్తికరంగా తెరకెక్కించారు. జె.ఎఫ్.కెన్నడీ, రాజీవ్ గాంధీ వంటి ప్రముఖ నేతల స్ఫూర్తితో రానా పాత్రను ఆయన తీర్దిదిద్దినట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని పార్లమెంటు సభ్యుడు, దేశ యవనేత రాహుల్ గాంధీకి చూపించాలని శేఖర్ కమ్ముల ఆసక్తిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం తనకున్న బిజీలో ఈ చిత్రాన్ని తిలకించేంత సమయం రాహుల్ కు ఉంటుందా అనేది చూడాలి. ఇదే జరిగితే ఢిల్లీకి చెందిన ఛానెల్స్ అన్నింటిలోనూ ప్రముఖంగా ఈ చిత్రానికి పబ్లిసిటీ రావడం ఖాయం. ఈ చిత్రాన్ని ప్రతి యువకుడు తప్పనిసరిగా చూడాలని రాహుల్ పిలుపునిచ్చినట్లయితే ఇక 'లీడర్'కు తిరుగుండదు. ఈనెల 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner