Sadhi's Blog Time

Jr Ntr Marriage Controversy

Friday, January 29, 2010




జూనియర్‌ ఎన్‌టీఆర్‌కు వ్యతిరేకంగా మచిలీపట్నం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడానికి జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సిద్ధమయ్యారంటూ న్యాయవాది ప్రసాద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనకోడలు కూతురు లక్ష్మీప్రణతిని ఎన్‌టీఆర్‌ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే లక్ష్మీ ప్రణతికి ఇపుడు 17 ఏళ్లేనని, ఆమె మైనర్‌ బాలిక అని, ఆమెకు పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని ప్రసాదు పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా... ప్రసాదు పిటిషన్‌ వేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అధికారికంగా పెళ్లి చేసుకోక ముందే కోర్టులో పిటిషన్‌ వేయడం ప్రచారం కోసమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడి ఫ్రీ పబ్లిసిటీ పొందటానికి కొందరు ప్రయత్నిస్తారని ఎన్‌టీఆర్‌ అభిమానులు మండిపడుతున్నారు.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner