Sadhi's Blog Time

Adurs crossed 30 crores mark

Thursday, January 28, 2010



జూ ఎన్టీఆర్ కథానాయకుడిగా, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన మూడవ సినిమా అదుర్స్. విడుదలయిన మొదటి వారంలోనే 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 15 రోజుల్లో 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది. గత సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదలయిన 'నమో వెంకటేశా' చిత్రం అవే రొటీన్ సీన్స్ తో వామ్మో వెంకటేశా అనిపిస్తుంటే, 'శంభో శివ శంభో' సినిమా యావరేజీగా వున్నా తమిళ వాసనలు ఎక్కువగా వుండటంతో మనవారికి రుచించలేదు. ఇక లేటుగా విడుదలయిన నితిన్ సినిమా 'సీతారాముల కళ్యాణం' సినిమా యావరేజీ టాక్ తో నడుస్తోంది. దీంతో తొలుత అబౌ యావరేజీ చిత్రంగా పేరు తెచ్చుకున్న అదుర్స్ సినిమా ఆ తర్వాత హిట్ రేంజికి చేరుకొని, ఇప్పుడు సూపర్ హిట్ స్థాయికై పరుగులు తీస్తోంది.

నరసింహా చారి పాత్రలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో భట్టాచారి పాత్రలో నటించిన బ్రహ్మానందం సైతం ఎన్టీఆర్ లాంటి నటుడితో నటించాలంటే కష్టం అన్నారంటే ఎన్టీఆర్ నటన ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నటనకు, బ్రహ్మానందం, ఎం.యస్ నారాయణ, రఘుబాబుల కామెడీ తోడయి సినిమా ఆసాంతం నవ్విస్తుండటంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మర్థం పడుతున్నారు. ఇక నయనతార, షీలా అందాలు సినిమాకు అధనపు ఆకర్షణ. సినిమా వసూళ్లు ఇదే విధంగా కొనసాగితే తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు..!!

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner