హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకోబోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మి ప్రణతికి ఈ ఏడాది మార్చి 28వ తేదీతో 18 ఏళ్ల వయస్సు దాటుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మీ ప్రణతి వివాహంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి 28వ తేదీ తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్ తో లక్ష్మి ప్రణతి వివాహ నిశ్చితార్థం జరుగుతుందని అంటున్నారు. పెళ్లి కూడా మేలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అందువల్ల మైనారిటీ సమస్య తలెత్తబోదని స్పష్టం చేస్తున్నారు. టీవీల్లో ప్రసారం చేసిన లక్ష్మిప్రణతి ఫొటోలు రెండేళ్ల కిందటివని అంటున్నారు. కాగా, లక్ష్మిప్రణతికి, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య వయస్సు తేడా పదేళ్లు ఉంటుంది.
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహం వ్యవహారంపై వివాదం ప్రారంభమైంది. మైనారిటీ తీరని బాలికను జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకోబోతున్నారంటూ మచిలీపట్నం లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలైంది. శాంతిప్రసాద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై లీగల్ సర్వీసెస్ అథారిటీ జూనియర్ ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, పెళ్లి కూతురు లక్ష్మీ ప్రణతి తండ్రి నార్నె శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ వివాహం నార్నె శ్రీనివాస రావు కూతురు లక్ష్మీ ప్రణతితో ఖారరైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాహం ఖరారైన విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సహా చంద్రబాబు కూడా ధ్రువీకరించారు. లక్ష్మీప్రణతి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో ఆమెకు మైనారిటీ తీరే పరిస్థితి లేదని అంటున్నారు. ఆమెకు 17 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. మైనారిటీ తీరాలంటే 18 ఏళ్ల వయస్సు దాటాల్సి ఉంటుంది. ఈ స్థితిలో శాంతిప్రసాద్ మచిలీపట్నం లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలు చేశారు.
లక్ష్మి ప్రణతికి 18 ఏళ్లు దాటుతాయి ( Laxmi pranathi Enter into 18 yrs on March 28 th)
Friday, January 29, 2010
Labels:
NEWS
Posted by
ramesh
at
Friday, January 29, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment