
మస్కా, దేవదాసు, రెడీ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ముద్రవేసుకున్న రామ్ తాజాగా "రామ రామ కృష్ణ కృష్ణ" అనే చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. ప్రస్తుతం శ్రావంతి రవి కిషోర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటోన్న కొత్త చిత్రం షూటింగ్‌లో రామ్ బిజీబిజీగా ఉన్నాడు.
మరోవైపు.. టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ దిల్‌రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టే కొత్త చిత్రంలోనూ రామ్ నటించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి "రామ రామ కృష్ణ కృష్ణ" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇంకా ఈ చిత్రాన్ని "లక్ష్యం" ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న "రామ రామ కృష్ణ కృష్ణ" సినిమాపై రామ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.











No response to “"రామ రామ కృష్ణ కృష్ణ" అంటోన్న రామ్!”
Post a Comment
ur views plz discuss