Sadhi's Blog Time

chiru what a pity ????

Monday, May 4, 2009




ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కోస్తున్న కోతలు చూసి చిరంజీవి కూడా నివ్వెరపోతున్నారు. తన ముందే అభ్యర్థులు కోస్తున్న కోతలు చూసి నోట మాతారక చిరంజీవి నివ్వెర పొవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు పై తాను విజయం సాధిస్తా నని చెప్పిన విషయం విన్న చిరంజీవి రెండు నిముషాల పాటు తేరుకోలేక పోయారు. తాను విన్నది నిజమేనా కలగన్నన అన్నది అర్థం కాక చిరంజీవి ఆశ్చర్యపోయారు. చంద్రబాబు కుప్పం నుంచి తమ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందడం అన్న విషయం తలుచుకొని అభ్యర్థి అవగాహన రహిత్యానికి నావ్వాలో ఎడ్వాలో అర్థం కానీ విచిత్ర పరిస్థితిలో పడిపోయారు.
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరి టాల సునీత మీద విజయం సాధిస్తానని అభ్యర్థి చెప్పిన విషయం విన్న చిరంజీవి చాలా అసహనానికి గురయ్యారు. తన ముందే ఇలాంటి కోతలు కోస్తుంటే ఎం చేయాలో అర్థం కాక చిరంజీవి డాక్టర్ మిత్ర వంక ఎం చేద్దాం అన్నట్లు చూశారని తెలిసింది.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner