మొట్ట మొదట ఇరాక్‍లో బుష్ పై బూటు విసిరి తన నిరసనను తెలిపాడు ఆల్‍జైదీ, మన దేశంలో హోంమంత్రి చిదంబరం, ఎంపి నవీన్ జిందాల్, బిజెపీ నేత అద్వానీలపై బూట్లు విసిరి తమ నిరసనను తెలియచేస్తున్నారు విద్యాధికులు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‍లోని ఠాగూర్ హాల్ గ్రౌండ్స్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రసంగిస్తుండగా, ప్రెస్ గ్యాలరీకి సమీపంలో మొదటి వరుసలో కూర్చున్న 21 ఏళ్ళ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి హితేష్ సహనాన్ని కోల్పోయి అబద్ధాలు చెప్పడం ఆపు అని అరుస్తూ కుర్చీపై నిలబడి కాలికి ఉన్న షూ తీసి ప్రధాని పై విసరగా అది వేదికకు 20 అడుగుల దూరంలో పడింది. వెంటనే ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు హుటాహుటిన వెళ్ళి హితేష్‍ను అదుపులోకి తీసుకుని అతన్ని బయటకు తీసుకువెళ్ళారు. అనంతరం ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. తాను అతన్ని క్షమించానని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రధాని గుజరాత్ సీఎల్పీ నేత శక్తిసింగ్ గోవిల్‍కు చెప్పినట్లు తెలిసింది. బూట్లు విసరడం వారిని నేతలు క్షమించడం షరా మామూలే కానీ విద్యాధికులు ఇలా చేయడం వారు వార్తల్లో నిలవాలని చేస్తున్న ప్రయత్నాలా లేక నిజంగానే వారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు తమకు అందక అలా చేస్తున్నారా...? మొట్ట మొదట ఇరాక్‍లో బుష్ పై బూటు విసిరి తన నిరసనను తెలిపాడు ఆల్‍జైదీ, మన దేశంలో హోంమంత్రి చిదంబరం, ఎంపి నవీన్ జిందాల్, బిజెపీ నేత అద్వానీలపై బూట్లు విసిరి తమ నిరసనను తెలియచేస్తున్నారు విద్యాధికులు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‍లోని ఠాగూర్ హాల్ గ్రౌండ్స్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రసంగిస్తుండగా, ప్రెస్ గ్యాలరీకి సమీపంలో మొదటి వరుసలో కూర్చున్న 21 ఏళ్ళ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి హితేష్ సహనాన్ని కోల్పోయి అబద్ధాలు చెప్పడం ఆపు అని అరుస్తూ కుర్చీపై నిలబడి కాలికి ఉన్న షూ తీసి ప్రధాని పై విసరగా అది వేదికకు 20 అడుగుల దూరంలో పడింది. వెంటనే ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు హుటాహుటిన వెళ్ళి హితేష్‍ను అదుపులోకి తీసుకుని అతన్ని బయటకు తీసుకువెళ్ళారు. అనంతరం ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. తాను అతన్ని క్షమించానని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రధాని గుజరాత్ సీఎల్పీ నేత శక్తిసింగ్ గోవిల్‍కు చెప్పినట్లు తెలిసింది. బూట్లు విసరడం వారిని నేతలు క్షమించడం షరా మామూలే కానీ విద్యాధికులు ఇలా చేయడం వారు వార్తల్లో నిలవాలని చేస్తున్న ప్రయత్నాలా లేక నిజంగానే వారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు తమకు అందక అలా చేస్తున్నారా...?
BOOTS VISARADAM FASHIONAAAA ? WHATS GOING ON.......?
Monday, April 27, 2009
Labels:
POLITICS COMMEDY
Posted by
ramesh
at
Monday, April 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
home mantri chidambaram enti ? home mantri laalu...
arthika mantri chidambaram
Post a Comment