Sadhi's Blog Time

Akhil Grand Launching in Rajamouli Direction

Thursday, February 3, 2011




బుడిబుడి నడకల బుడతడిగా ఉన్నప్పుడే వెండితెర మీద సంచలనం క్రియేట్ చేసాడు అఖిల్. 'సిసింద్రీ' సినిమా ద్వారా అప్పట్లోనే ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడీ కుర్రాడికి పదిహేడేళ్ళు. అటు క్రికెట్లోనూ, ఇటు సినిమాలలోనూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అఖిల్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఓ గుడ్ న్యూస్. తన పుత్రరత్నాన్ని ఓ గ్రేండ్ ప్రాజక్ట్ ద్వారా ఇంట్రడ్యుస్ చేయడానికి నాగార్జున, అమల ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ ని లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈమధ్య 'రాజన్న' చిత్రం డిస్కషన్స్ సందర్భంగా నాగ్ ను రాజమౌళి ఎక్కువగా కలవడం జరుగుతోంది. ఆ సందర్భంగా నాగ్ రాజమౌళిని అడిగినట్టు, ఆయన కూడా అఖిల్ ని లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అఖిల్ ప్రస్తుతం టీనేజ్ లో ఉన్నందున అందుకు తగ్గట్టుగా లవ్ స్టోరీని తయారుచేయనున్నట్టు తెలుస్తోంది. లవ్ స్టోరీలలోనే మునుపెన్నడూ రాని విధంగా, ఓ భారీ చిత్రంగా దీనిని నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న 'ఈగ', నాగ్ చేస్తున్న 'రాజన్న' పూర్తయ్యాక అఖిల్ ప్రాజక్టును చేబడతారు. సో... అక్కినేని వంశం నుంచి మరో హీరో త్వరలో వెండితెరకు వేంచేయనున్నాడన్న మాట!

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner