Sadhi's Blog Time

ఐపిఎల్‌లో సౌరవ్‌ ఆడనున్నాడా?

Thursday, February 3, 2011



కోల్‌కతా : ఈ సంవత్సరం జరిగే నాలుగో ఐపిఎల్‌లో భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తిరిగి ఏదో ఒక ప్రాంఛైజ్‌ తరఫున ఆడే అవకాశం ఉందా? అంటే ..అవుననే సమాధానాలు వస్తు న్నాయి.
జనవరి 8,9 తేదీల్లో జరిగిన వేలం పాటలో సౌరవ్‌ను ఏ ప్రాంఛైజ్‌ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. దీంతో దాదాపు సౌరవ్‌కు ఐపిఎల్‌ ఆడే అవకాశం లేనట్లుగా భావించాలి.
అదేవిధంగా ఐపిఎల్‌ నిబంధనల ప్రకారం వేలంపాటలో కొనుగోలుకాని భారతీయ ఆటగాళ్లు ఆ తర్వాత కాంట్రాక్టులపై సంతకం చేయడానికి వీలు లేదు. కాని కోచి ప్రాంఛైజ్‌ మాత్రం గంగూలీతో కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఇందుకుగానూ కోచి ఇప్పటికే బిసిసిఐని సంప్రదించింది. ఒకవేళ బిసిసిఐ కనుక ఓకె చెబితే గంగూలీ కోచి తరఫున బరిలో దిగొచ్చు. అది ఏ స్థాయిలో అనేది చూడాల్సిందే !
కాగా ఈ విషయమై ఫిబ్రవరి 4న జరిగే గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. వేలం పాటకు ముందు గంగూలీ తన బేస్‌ప్రైస్‌ను 4 లక్షల డాలర్లకు పెంచడం అందరినీ విస్మయ పర్చడం, అతడిని ఎవరూ కొనుగోలు చేయకపోవడం

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner