టాలీవుడ్ లో బి-గ్యాంగ్ లింకులన్నీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నకొద్దీ అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇవేమీ తెలియని వాళ్లు 'ఇన్నాళ్లూ తమ చుట్టూ ఇంత సీన్ జరిగిపోయిందా?' అని ముక్కు మీద వేలేసుకుంటుంటే, ఇవి తెలిసిన వాళ్లు, వీటితో అంతో ఇంతో సంబంధం వున్నా వాళ్లు అయితే, తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అన్న భయంతో హడలిపోతున్నారు. ఇక ఈ వ్యవహారంలో లింకులున్నట్టుగా భావిస్తున్న సి. కల్యాణ్, శింగనమల రమేష్, గణేష్ బాబు వంటి నిర్మాతలతో సినిమాలు చేసిన వాళ్లు, చేస్తున్న వాళ్లు అయితే, ఈ కేసు తమకెక్కడ చుట్టుకుంటుందో అని కంగారుపడుతున్నారు. ఇంతకు ముందు రిలీజ్ అయిన 'పులి', 'ఖలేజ', 'రక్త చరిత్ర', 'పరమ వీర చక్ర' వంటి చిత్రాలు ఈ గ్యాంగు డబ్బుతో నిర్మించినవే అన్న విషయం తెలియడంతో ఆయా సినిమాల హీరోలు ఆ చిత్రాలు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు తెలిసింది.
'ఇన్నాళ్లూ వీళ్లు పెద్ద మనుషులనుకున్నాం, వీళ్లు బి -గ్యాంగ్ నుంచి డబ్బు తెచ్చి సినిమాలు తీస్తున్నారన్నది మాకు తెలియదు' అని వాపోతున్నారట. తాజాగా గణేష్ బాబు పేరు కూడా బయటకు రావడంతో, అతను నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బి-గ్యాంగ్ నుంచి ఫైనాన్స్ తీసుకున్న వాళ్ల జాబితాలో తాజాగా జగపతిబాబు పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాతల మండలి ఈ విషయంలో సీరియస్ గా వున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కి అంటుకున్న మాఫియా బురదను ఎలా కడిగి, ఒడ్డునపడాలా అని నిర్మాతల మండలి ఆలోచిస్తోంది. ఏది ఏమైనా, ఈ విషయంలో ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి!
Tollywood heroes in fear of having links with B-gang
Saturday, January 22, 2011
Posted by
ramesh
at
Saturday, January 22, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment