తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఎన్.శంకర్ రూపొందించిన 'జై బోలో తెలంగాణా' చిత్రానికి సెన్సార్ చిక్కులు ఎదురయ్యాయి. ఈ నెల 28 న దీనిని రిలీజ్ చేయడానికి శంకర్ ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో, ఇప్పుడు సెన్సార్ అభ్యంతరాలు తలెత్తడం తెలంగాణా వాదులకి మింగుడుపడడం లేదు. ఇది సమైక్యవాదుల కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. ఈ రోజు సెన్సార్ కి వెళ్లిన ఈ చిత్రాన్ని చూసిన సభ్యులు కొన్ని సన్నివేశాల పట్ల అభ్యంతరం చెప్పడం జరిగింది. ముఖ్యంగా సీమాంధ్ర నాయకుల్ని అవమానపరిచే విధంగా వున్న కొన్ని సీన్లకు సెన్సార్ అబ్జక్షన్ చెప్పినట్టు తెలిసింది. వాటిని తొలగించమని సెన్సార్ నిర్మాతకు సూచించినట్టు, దానికి దర్శక నిర్మాత శంకర్ అంగీకరించనట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!
'Jai Bolo Telangana' faces censor problems
Tuesday, January 25, 2011
Labels:
movies on sets
Posted by
ramesh
at
Tuesday, January 25, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment