Sadhi's Blog Time

Film industry flooded by Padma awards

Tuesday, January 25, 2011



భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఈ ఏడాది పద్మ అవార్డులు బాగానే వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ప్రకారం ప్రముఖ హిందీ నటులు శశికపూర్, వహీదా రెహ్మాన్ లకు పద్మ విభూషణ్ లభించాయి. సంగీత దర్శకుడు ఖయ్యుం కి పద్మ భూషణ్ ప్రకటించగా, గాయని ఉషా ఊతప్ కు పద్మశ్రీ లభించింది. ఇక బాలీవుడ్ ఆర్టిస్టులు ఇర్ఫాన్ ఖాన్, కాజల్, తబూలకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. వహీదా రెహ్మాన్ 'రోజులు మారాయి' సినిమాలో 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న...' పాటలో చేసిన నృత్యం ఎంతో పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, తెలుగు చిత్ర రంగం నుంచి ఎవరినీ పద్మ అవార్డులకు ఎంపిక చేయపోవడం టాలీవుడ్ ని మరోసారి నిరాశపరిచింది.

0 comments:

Liked it - Share it :)

Subscribe via email

Enter your email address:

Delivered by FeedBurner